విశ్వక్ నుంచి లైలా ట్రాన్స్‌ఫార్మేషన్.. మేకింగ్ వీడియో చూశారా!

విశ్వక్ నుంచి లైలా ట్రాన్స్‌ఫార్మేషన్.. మేకింగ్ వీడియో చూశారా!

Published on Jan 27, 2025 8:07 PM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’ ఇప్పటికే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి ఓ లేడీ గెటప్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను క్రియేట్ చేశాయి. అయితే, ఈ సినిమాలో లేడీ గెటప్‌లో విశ్వక్ అదిరిపోయాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలోని లేడీ గెటప్‌లోకి విశ్వక్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. లైలా గెటప్‌లోకి విక్వక్‌ తనను తాను మార్చుకున్న తీరు ఇందులో చూపెట్టారు. లేడీగా కనిపించేందుకు విశ్వక్ ఐబ్రోస్ కూడా చేయించుకున్నట్లు మనకు ఇందులో కనిపిస్తుంది.

మొత్తానికి లేడీ గెటప్ కోసం నిజంగానే ఆడవారు చేసుకునే పార్లర్ ట్రీట్మెంట్ విశ్వక్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు