టీజర్ టాక్ : ఫంకీ.. అనుదీప్ మార్క్ మస్తు కామెడీతో విశ్వక్ చెలరేగాడు..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లాస్ట్ మూవీ ‘లైలా’ ఫ్లాప్‌గా నిలవడంతో ఇప్పుడు మరో కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఫంకీ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాను ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కె.వి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే, తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ చిత్ర టీజర్ అనుదీప్ మార్క్ మస్త్ కామెడీతో పాటు విశ్వక్ మార్క్ మేనరిజంతో ప్రేక్షకులను ఫుల్లుగా ఆకట్టుకుంటోంది. ఇందులోని పంచు డైలాగులు ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఈ చిత్ర టీజర్ ఆకట్టుకోవడంతో అప్పుడే ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

ఈ సినిమాను నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా రిలీజ్ డేట్‌ను త్వరలో వెల్లడించనున్నారు.

Exit mobile version