‘మీసాల పిల్ల’.. ముహూర్తం ఫిక్స్ చేసిన శంకర వర ప్రసాద్ గారు..!

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర మంచి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని మేకర్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని ‘మీసాల పిల్ల’ పాట ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

అనిల్ రావిపూడి ప్రమోషన్లతో జోష్ ప్రారంభించగా, ఈ మెలోడి ప్రోమోకు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సాంగ్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ సాంగ్‌ను అక్టోబర్ 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ విషయాన్ని అనిల్ రావిపూడి, ‘సంక్రాంతికి వస్తున్నాం’లోని బుల్లి రాజుతో కలిసి సరదాగా ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాట ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version