ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ డ్రాగన్.. ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా..?

NTRNeel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవడంతో ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి రిలీజ్ నుంచి జూన్ 2026 కి మార్చారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఈ మూవీ జూన్ 2026లో వచ్చే దాఖలాలు లేవని చెప్పాలి. ఎన్టీఆర్ తన రీసెంట్ ప్రాజెక్ట్‌ల కోసం భారీగా డేట్స్ ఇవ్వడంతో ఎన్టీఆర్-నీల్ మూవీ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇక ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ మూవీ షూటింగ్‌లో అక్టోబర్ చివరినాటికి జాయిన్ అవుతాడని.. ఆ తర్వాత నిర్విరామంగా వచ్చే వేసవి వరకు ఈ చిత్ర షూటింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. దీంతో ఈ సినిమా 2026 చివరికల్లా రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Exit mobile version