కె-ర్యాంప్ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. చూసుకోండి అంటున్న కిరణ్ అబ్బవరం..!

హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘కె-ర్యాంప్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కిరణ్ అబ్బవరం మంచి హిట్ అందుకుంటాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ఈ చిత్రంపై అంచనాలు పెంచింది.

ఇక ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అక్టోబర్ 11న సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ ట్రైలర్ అభిమానులను ర్యాంప్ ఆడించడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.

యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా రాజేష్ దండా, శివ బొమ్మక్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version