ఆంధ్ర కింగ్ తాలూకా.. టీజర్ వచ్చేస్తోంది..!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేశ్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్ర టీజర్‌ను అక్టోబర్ 12న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ టీజర్ ప్రేక్షకులను, అభిమానులను అమితంగా ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాలో రామ్ పోతినేని తో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర, అందాల భామ భాగ్యశ్రీ బొర్సె తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ ద్వయం వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా నవంబర్ 28న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version