మంచు బ్రదర్స్ ఇద్దరూ అందరినీ ఆశ్చర్యపరిచే రీతిలో రిస్కీతో కూడుకున్న డేంజర్ స్టంట్స్ చేస్తుంటారు. విష్ణు మంచు అదే తరహాలో తన రాబోయే సినిమా దూసుకెళ్తా లో స్టంట్ చేసాడు. ఒక ఫైట్ సీక్వెన్స్ లో విష్ణు వేగంగా గాలిలోలోకి ఎగిరిన ఓ జీప్ నుండి ఎగిరి దూకాలి. ఆ స్టంట్ అని అతను ఎలాంటి రోప్స్ వాడకుండా చేసాడు. దాంతో చిత్ర యూనిట్ అంతా ఊపిరి బిగపట్టుకొని ఆ స్టంట్ చేసారు. ఎలాంటి ప్రమాదం లేకుండా ఆ స్టంట్ పూర్తవ్వడంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్ కేచ ఈ మూవీ కి యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేస్తున్నాడు. వీరూ పోట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. అందాల రాక్షసి ఫేం లావణ్య హీరోయిన్ గా నటిస్తోంది. ఫుల్ కామెడీగా సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. విష్ణు ఈ సినిమాని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు.