వీరూ పోట్ల దర్శకత్వంలో మంచు విష్ణు నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు తిరుపతిలో ప్రారంభం కానుంది. ‘దేనికైనా రెడీ’ విజయం తరువాత విష్ణు, వీరూ పోట్ల చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా స్క్రిప్ట్ పనిలో నిమగ్నమై ఉన్నారు. వీరూ పోట్ల ఇప్పటికే ‘రగడ’, ‘బిందాస్’ వంటి చిత్రాలతో కమర్షియల్ ఎంటర్టైనర్స్ ని తీయగల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
“గుడ్ మార్నింగ్. వీరూ పొట్ల దర్శకత్వంలో నేను చేయనున్న చిత్రం ఈ రోజే మొదలుకానుంది. చాలా ఉత్తేజంతో తిరుపతిలో ఉన్నాం”, అని విష్ణు ట్వీట్ చేసాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు ఈ మూవీని నిర్మించనున్నాడు. ‘అందాల రాక్షసి’ సినిమాలో కనిపించిన లావణ్య ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో విష్ణుకి జంటగా నటించనుంది. మిగిలిన తారల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.