వాయిదా పడ్డ ‘శివతాండవం’ విడుదల

వాయిదా పడ్డ ‘శివతాండవం’ విడుదల

Published on Sep 25, 2012 12:49 PM IST


విలక్షణ నటుడు విక్రమ్ మరియు యోగా బ్యూటీ అనుష్క జంటగా నటించిన ‘శివతాండవం’ చిత్రం ఈ నెల 28న విడుదల కావడంలేదు. ఈ చిత్రం పై నిర్మాత నట్టి కుమార్ ఫిర్యాదు చేయగా ఈ చిత్ర విడుదలని తెలుగు మరియు తమిళ భాషల్లో నిలిపివేశారు. ఇంతకి విషయం ఏమిటంటే సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ తెలుగు చిత్రంగా విడుదల చేయనున్నారు, కానీ ఈ చిత్రం ద్వి భాషా చిత్రంగా తెరకెక్కలేదని ఒక్క తమిళంలో మాత్రమే తెరకెక్కించారని, సి. కళ్యాణ్ దాన్ని మభ్య పెట్టి అటు ప్రభుత్వాన్ని, ఇటు సెన్సార్ వారిని మోసం చేసి డైరెక్ట్ తెలుగు చిత్రంగా విడుదల చేస్తున్నారని నట్టికుమార్ ఫిర్యాదు చేసారు. ఈ వివాదం పరిష్కారం అయ్యే వరకూ సినిమాని విడుదల చేయలేమనే ఉద్దేశంతో సినిమా విడుదలని వాయిదా వేశారు. ఈ సినిమా అక్టోబర్ 4న విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

జగపతి బాబు, అమీ జాక్సన్ మరియు లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఎ.ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. విక్రమ్ ఈ సినిమాలో ఎకోలేషణ్ విద్యలో ఆరితేరిన అంధుడిగా కనిపించనున్నారు. జి.వి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

తాజా వార్తలు