టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన ఇటీవల చిత్రాల్లో రాబిన్ హుడ్ అలాగే తమ్ముడు చిత్రాలు ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఊహించని విధంగా నిరాశనే మిగిల్చాయి. మరి ఈ రెండు సినిమాల్లో రాబిన్ హుడ్ జీ5 లో స్ట్రీమింగ్ కి రాగ తమ్ముడు చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మరి వీటిలో ఓ సినిమా మరో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చింది.
ఇక ఆ సినిమానే దర్శకుడు వెంకీ కుడుములతో చేసిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘రాబిన్ హుడ్’. ఇన్ని రోజులు జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇటీవల మరో ఓటిటి యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులోకి వచ్చింది. కాకపోతే ప్రైమ్ వీడియోలో ఈ సినిమా హిందీ వెర్షన్ లో స్ట్రీమ్ అవుతుంది. నితిన్ హిందీ డబ్బింగ్ సినిమాలకి మంచి ఆదరణ ఉంది. అలా రాబిన్ హుడ్ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఆల్రెడీ ఇండియా వైడ్ టాప్ 4 లో ట్రెండ్ అవుతుంది.