‘ఖుషి’ కాంబినేషన్ రిపీట్ కానుందట

‘ఖుషి’ కాంబినేషన్ రిపీట్ కానుందట

Published on Nov 17, 2020 11:57 PM IST

తమిల్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొత్తం ముగియడంతో విడుదల సన్నాహాలు జరుగుతున్నాయి. థియేటర్లు రీఓపెన్ అవగానే విడుదల తేదీని ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా విజయ్ తర్వాతి సినిమాను ఎవరు చేస్తారనే విషయమై చాలా రోజుల నుండి సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. మొదట మురుగదాస్ అనుకున్నారు. కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ పేరు వినిపించినా ఇప్పుడు ఆయన కూడ చేయట్లేదని తేలింది.

తాజాగా డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్.జె. సూర్య విజయ్ 65వ సినిమాకు దర్శకత్వం వహిస్తారనే టాక్ వినబడుతోంది. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే గతంలో ఎస్.జె.సూర్య, విజయ్ కాంబినేషన్లో ‘ఖుషి’ సినిమా వచ్చింది. 2000లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీన్నే తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఖుషి’ పేరుతోనే రీమేక్ చేశారు ఎస్.జె.సూర్య. ఆ సినిమాతర్వాత వీరు మళ్ళీ కలిసి పనిచేయలేదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు కలిసి వర్క్ చేస్తారనే టాక్ వినబడుతోంది. ఇప్పటికే సూర్య స్టోరీ చెప్పేశారని తమిళ సినీ వర్గాల్లో టాక్ వినబడుతోంది. మరి ఈ వార్తలు నిజమో కాదో చూడాలి.

తాజా వార్తలు