‘మెర్సల్, సర్కార్, బిగిల్’ ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘మాస్టర్’ చిత్రం చేస్తున్నారు. షూటింగ్ సగం పూర్తిచేసుకున్న ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 9న విడుదలకానుంది. ఇది పూర్తవగానే ఆయన సుధా కొంగర డైరెక్షన్లో ఒక చిత్రం చేస్తారనే టాక్ ఉంది. ఇప్పటికైతే ఇంకా అఫీషియల్ క్కన్ఫర్మేషన్ రాలేదు.
కానీ ప్రాజెక్ట్ అయితే ఉంటుందని, ఆ చిత్రం 2021 సంక్రాంతికి విడుదలవుతుందని, ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇకపోతే ‘ఇరుద్ది సుత్రు’ చిత్రంతో దర్శకురాలిగా సత్తా చాటిన సుధా కొంగర దాన్ని తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేసి ఇక్కడా హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె సూర్యతో చేస్తున్న ‘సూరరై పొట్రు’ త్వరలోనే విడుదలకానుంది. బహుశా ఈ చిత్రం విడుదల తర్వాత విజయ్ చిత్రంపై ఆమె క్లారిటీ ఇవ్వొచ్చు.