బోల్ బచ్చన్ రీమేక్ కి డైరెక్టర్ ఖరారు

బోల్ బచ్చన్ రీమేక్ కి డైరెక్టర్ ఖరారు

Published on Jan 27, 2013 1:25 PM IST

vijaybhaskar
వరుస పరాజయాలతో ఉన్న డైరెక్టర్ విజయభాస్కర్ 2011లో తీసిన ‘ప్రేమ కావాలి’ సినిమాతో హిట్ అందుకొని ఫాంలోకి వచ్చాడు. హిట్ అందుకొని రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా తదుపరి సినిమా మాత్రం మొదలుపెట్టలేదు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం విక్టరీ వెంకటేష్ – రామ్ హీరోలుగా తెరకెక్కనున్న ‘బోల్ బచ్చన్’ రీమేక్ కి ఆయన దర్శకత్వం వహించనున్నాడు.

హిందీలో అజయ్ దేవగన్ పోషించిన పాత్రను వెంకటేష్, అభిషేక్ బచ్చన్ పోషించిన పాత్రని రామ్ పోషించనున్నాడు. ఇప్పటికే వెంకటేష్ – విజయభాస్కర్ కాంబినేషన్లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. స్రవంతి రవికిషోర్ – సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

తాజా వార్తలు