కోలీవుడ్ టాలెంటెడ్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నిత్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే ‘తలైవన్ తలైవి’. తమిళనాట సూపర్ హిట్ అయ్యిన ఈ సినిమా తెలుగులో ‘సార్ మేడం’ పేరిట విడుదల అయ్యి మన దగ్గర కూడా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఓటిటిలో ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది.
ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో నేటి నుంచి తెలుగు, తమిళ్ సహా హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఈ సినిమాని చూడాలి అనుకుంటే ఇప్పుడు చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సాయి జ్యోతి ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.