‘బాద్షా’ రీమేక్ పై కన్నేసిన తమిళ స్టార్ విజయ్

‘బాద్షా’ రీమేక్ పై కన్నేసిన తమిళ స్టార్ విజయ్

Published on Apr 4, 2013 1:15 PM IST

Vijay

తమిళ స్టార్ విజయ్ తెలుగు సినిమాలని ఎక్కువగా రీమేక్ చేస్తుంటాడని మనకు తెలుసు. ఇలా రీమేక్ చేసిన చాలా సినిమాలు తమిళంలో హిట్ ను సాదించాయి. తాజా సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘బాద్షా’ ని రీమేక్ చేయాలనుకుంటున్నాడని తెలిసింది. ఈ సినిమా విడుదలకు ముందే మంచి పేరు రావడంతో విజయ్ ఈ సినిమా కోసం పీవీపీ పిక్చర్స్ ద్వారా నిర్మాత బండ్ల గణేష్ ను సంప్రదించారని సమాచారం. ఈ డిస్కషన్ ఇప్పుడు చివరి దశలో వుంది.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, సుహాసిని ఎన్.టి.ఆర్ తల్లిగా నటించారు. నవదీప్ ఈ సినిమాలో ఓ నెగిటివ్ పాత్రలో కనిపించాడు. ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలకానుంది.

తాజా వార్తలు