బిగ్ బాస్ 9: వీక్షకుల్లో ఈ కంటెస్టెంట్ కి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్

బిగ్ బాస్ 9: వీక్షకుల్లో ఈ కంటెస్టెంట్ కి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్

Published on Sep 14, 2025 2:35 PM IST

BB9-Telugu

తెలుగు స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ 9 ఇటీవల మొదలై మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ప్రముఖులు అలాగే సామాన్యుల నడుమ హోరాహోరీ పోటీగా డిజైన్ చేసిన గేమ్ షో అంతే ఆసక్తిగా కూడా నడుస్తుంది.

అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలా ఆడుతున్నారు ఎవరి మెంటాలిటీ ఏంటి అనేది మాత్రం బయట చూస్తున్న వీక్షకులు మాత్రమే డిసైడ్ చేస్తారు. ఇలా ఈసారి సీజన్ లో కంటెస్టెంట్స్ పట్ల ఒకొకరికి మీద ఒకో అభిప్రాయం వచ్చింది. అయితే అలా ఓ కంటెస్టెంట్ పట్ల మాత్రం షో ఫాలో అవుతున్న నెటిజన్స్ లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ బాగా కనిపిస్తుంది.

మరి ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు కమెడియన్ సుమన్ శెట్టి తన ఎంట్రీ తర్వాత నుంచి హౌస్ లో తన ఇన్నోసెన్స్ కొన్ని సందర్భాల్లో తన నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ అలాగే ఎమోషన్స్ పరంగా కూడా వీక్షకుల్లో వర్కౌట్ అయ్యినట్టు కనిపిస్తున్నాయి. దీనితో తనకి మాత్రం మంచి పాజిటివ్ గానే ఉందని చెప్పాలి. ఇది ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి మరి.

తాజా వార్తలు