నవంబర్ 9న విజయ్ తుపాకి

నవంబర్ 9న విజయ్ తుపాకి

Published on Oct 11, 2012 4:14 AM IST


ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ మరియు కాజల్ ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “తుపాకి” నవంబర్ 9 న విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రం కోసం మొదటిసారిగా మురగదాస్ మరియు విజయ్ కలిసి పని చేశారు. ఈ చిత్ర టైటిల్ గురించి చాలా కాలం కాంట్రవర్సి నడిచింది . ఈ మధ్యనే ఈ చిత్ర నిర్మాతలు ఈ కేసు లో గెలిచి ఈరోజు మొదటి లుక్ ని విడుదల చేశారు. ఆడియో కూడా ఈరోజు విడుదల అయ్యింది ఈ చిత్ర ఫస్ట్ లుక్ కి అద్భుతమయిన స్పందన కనిపించింది. విజయ్ ని గతంలో ఎన్నడూ చూడని విధంగా ఇందులో చూపించారు ఈ చిత్రం మొత్తం ముంబై నేపధ్యంలోసాగుతుంది. సంతోష్ శివన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. శోభ రాణి ఈ చిత్ర తెలుగు విడుదల హక్కులను భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకున్నారు.

తాజా వార్తలు