పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న జరుపుకుంటున్నారు. దీంతో ఆయన అభిమానుల కోసం ఆయన నటిస్తున్న చిత్ర మేకర్స్ అదిరిపోయే ట్రీట్స్‌ను రెడీ చేస్తున్నారు. ఇందులో ముందుగా దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ నుంచి ఓ సాలిడ్ ట్రీట్ అయితే వచ్చింది.
ఈ సినిమా నుంచి ఓ సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌తో పవన్ తనదైన స్వాగ్‌లో కింగ్‌లా కనిపిస్తున్నాడు. బ్లాక్ అండ్ బ్లాక్ వేర్‌తో పవన్ ఇచ్చిన డ్యాన్స్ ఫోజ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక ఈ సినిమాలో ఆయన చేయబోయే డ్యాన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అప్పుడే అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాలో అందాల భామలు శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.