ఓటీటీలో సందడి చేయనున్న ‘కన్నప్ప’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఓటీటీలో సందడి చేయనున్న ‘కన్నప్ప’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Published on Sep 1, 2025 6:30 PM IST

టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాతో విష్ణు మంచు పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాను రిలీజ్ చేసి సందడి చేశాడు.

ఈ సినిమాలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు లాంటి స్టార్స్ నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్ కూడా క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా, అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

కన్నప్ప చిత్ర డిజిటిల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ఓటీటీలో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

తాజా వార్తలు