ఫైటర్ క్లైమాక్స్ కోసం సిక్స్ ప్యాక్ !

టాలీవుడ్‌ సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ లుక్స్ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాడు. ఇక ప్రస్తుతం విజయ్, డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఫైటర్ అంటూ ఓ సినిమా చేస్తోన్నాడు. కాగా ఈ సినిమాలో ఒక్క క్లైమాక్స్ ఫైట్ కోసం విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడు. కేవలం ఒకే ఒక్క సీన్ కోసం గత ఎనిమిది నెలలు నుండి విజయ్ వర్కౌట్స్ చేసి సిక్స్ ప్యాక్ చేయడం నిజంగా గ్రేటే.

ఇక తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేసిన విజయదేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారాడు. ‘ఫైటర్’ సినిమాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు.

ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

Exit mobile version