కొత్త లుక్ లో విజయ దేవరకొండ !

కొత్త లుక్ లో విజయ దేవరకొండ !

Published on Jun 21, 2020 9:30 PM IST

టాలీవుడ్‌ సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ లేటెస్ట్ లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సారి విజయ్ హెయిర్ స్టైల్ మార్చడంతో లుక్ చాల బాగుంది. ఈ లుక్ లో విజయ్ ఫోటో బాగా వైరల్‌ అవుతుంది. ఇక తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేసిన విజయదేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారాడు.

ప్రస్తుతం క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ‘ఫైటర్’ సినిమా చేస్తోన్నాడు. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

https://www.instagram.com/p/CBsl4TEhFoi/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు