టాలీవుడ్ నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ కేవలం సినిమాలను ప్రొడ్యూస్ చేయడమే కాకుండా డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంటారు. ఆయన తాజాగా ‘వార్ 2’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేయడం ఖాయమని.. అభిమానులు ఈ సినిమాను హిందీ వెర్షన్ కంటే కూడా ఎక్కువ విజయాన్ని అందించేలా చూడాలని ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆయన కామెంట్స్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ కామెంట్స్ కారణంగా నాగవంశీని సోషల్ మీడియాలో గతకొద్ది రోజులుగా ట్రోలింగ్ చేస్తున్నారు.
వార్ 2 డిజాస్టర్ దిశగా వెళ్తుండటంతో నాగవంశీ పని అయిపోయిందని చాలా ట్రోల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. వీటన్నింటికి ఆయన తాజాగా సమాధానం ఇచ్చారు. తనని సోషల్ మీడియాలో చాలా మిస్ అవుతున్నారని.. తనపై చాలా రకాల కథలు వస్తున్నాయని.. సోషల్ మీడియాలో మంచి రైటర్లు ఉన్నారని.. అయితే, తన పని అయిపోయిందని అనుకున్న వారందరినీ డిజప్పాయింట్ చేశానని.. తాను సినిమాలు ఆపే సమయం ఇంకా ముందు ఉందని గట్టి రిప్లై ఇచ్చాడు.
మాస్ జాతరతో మళ్ళీ థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నామని నాగవంశీ అన్నారు. మరి నాగవంశీ చేసిన పోస్ట్‌కు ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి.