‘నీలి నీలి ఆకాశం’ మ్యాజిక్ రిపీట్ చేయనున్న ‘బ్యాడ్ గాళ్స్’ టీమ్!

‘నీలి నీలి ఆకాశం’ మ్యాజిక్ రిపీట్ చేయనున్న ‘బ్యాడ్ గాళ్స్’ టీమ్!

Published on Aug 20, 2025 7:00 AM IST

‘నీలి నీలి ఆకాశం’ పాటతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న డైరెక్టర్ మున్నా ధులిపూడి, ఇప్పుడు మరో వినూత్న ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, రోహన్ సూర్య, మొయిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పేరు ‘బ్యాడ్ గాళ్స్’. “కానీ చాలా మంచోళ్లు” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించగా, మెలోడీ బ్రహ్మ అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో 5 మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇప్పుడు, మరో మెలోడీ పాట ‘ఇలా చూసుకుంటానే’ను త్వరలో విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన ప్రీ-టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఇందులో చంద్రబోస్ నటన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

దర్శకుడు మున్నా ధూళిపూడి మాట్లాడుతూ, ‘‘ఇలా చూసుకుంటానే’ పాటను ‘బ్యాడ్ గాళ్స్’ ద్వారా త్వరలో విడుదల చేస్తున్నాం. చంద్రబోస్ గారి అద్భుతమైన లిరిక్స్, అనూప్ రూబెన్స్ స్వరాలు, సిద్ శ్రీరామ్ గాత్రం ఈ పాటను ‘నీలి నీలి ఆకాశం’ కంటే మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి. త్వరలోనే ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. ‘బ్యాడ్ గాళ్స్’ పూర్తిగా వినోదాత్మక చిత్రం. ‘జాతి రత్నాలు’, ‘మ్యాడ్’ లాంటి హిలేరియస్ మూవీస్ అమ్మాయిలు చేస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాం,’’ అని తెలిపారు.

తాజా వార్తలు