‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?

‘మాస్ జాతర’ కొత్త డేట్ ఇదేనా?

Published on Aug 20, 2025 9:00 AM IST

మన టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన మాస్ యాక్షన్ చిత్రమే ‘మాస్ జాతర’. మొదటి నుంచి మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎప్పుడో మే నెల లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ రాలేదు. అక్కడ నుంచి ఆగస్ట్ 27కి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు అందుకు వారమే గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు విడుదల కాదు అని అందరికీ తెలిసిందే.

ఇక కొత్త డేట్ ఏంటి ఎప్పుడు అనేది ఇపుడు తెలుస్తుంది. దీని ప్రకారం సెప్టెంబర్ 12గా మాస్ జాతర డేట్ లాక్ అయినట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు