పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు బలపడుతున్నాయి. అయితే, ఈ సినిమాలో పవన్ ఎలాంటి పాత్రలో నటిస్తాడనే విషయంపై తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో పవన్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడనే వార్త వినిపిస్తోంది. అయితే, ఆయన మిలిటరీ ఆఫీసర్ అనే విషయం ఇంటర్వెల్ ముందు తెలుస్తోందని.. ఆ తర్వాత సెకండాఫ్‌లో పవన్ పూర్తి స్థాయి యాక్షన్ మోడ్‌లోకి దిగుతాడనే వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో పవన్ ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
వచ్చే మార్చి నుంచి పవన్ ఈ సినిమా షూటింగ్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో హీరో కూడా ఉండనున్నట్టు టాక్ వినిపిస్తోంది, అయితే ఆయన ఎవరనే విషయాన్ని రివీల్ చేయాల్సి ఉంది.


