ట్రైలర్ టాక్ : రామ్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్‌తో మెస్మరైజింగ్‌గా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

ట్రైలర్ టాక్ : రామ్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్‌తో మెస్మరైజింగ్‌గా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Published on Nov 18, 2025 9:19 PM IST

Andhra King Thaluka

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగిందని చెప్పాలి. ఓ హీరోకు వీరాభిమానిగా రామ్ పర్ఫార్మెన్స్ టెర్రిఫిక్‌గా అనిపించింది. ఇక తన జీవితంలో ఎదురయ్యే ప్రేమ, యాక్షన్, ఎమోషన్స్ వంటి సీన్స్‌లోనూ రామ్ సూపర్బ్ అనిపించేలా కనిపిస్తున్నాడు. అటు భాగ్యశ్రీ కూడా చాలా న్యాచురల్‌గా కనిపిస్తోంది. కొన్ని డైలాగులు కూడా ఈ ట్రైలర్‌లో బాగా పేలాయి.

ఇక అభిమాని కోసం హీరో ఎలాంటి అడుగు వేస్తాడనేది ఈ సినిమాలో ముఖ్య కథగా సాగనుందని మనకు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు వివేక్-మెర్విన్ సంగీతం అందించారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 28న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు