‘సంతాన ప్రాప్తిరస్తు’ రెస్పాన్స్‌తో అందరూ హ్యాపీ – నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి

‘సంతాన ప్రాప్తిరస్తు’ రెస్పాన్స్‌తో అందరూ హ్యాపీ – నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి

Published on Nov 19, 2025 12:00 AM IST

విక్రాంత్-చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ అందుకుంటోంది. మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం. సినిమాను ఆడియెన్స్ దగ్గరకు రీచ్ చేసేందుకు మా పీఆర్ఓస్ చాలా కష్టపడ్డారు. హీరో విక్రాంత్, హీరోయిన్ చాందినీ తమ బెస్ట్ వర్క్ ఈ సినిమాకు ఇచ్చారు. ప్రతి సందర్భంలో సినిమాను నమ్మి నిలబడ్డారు. మురళీధర్ గౌడ్ గారు మా సినిమాకు పెద్ద అసెట్ అవుతారని స్క్రిప్ట్ టైమ్ లోనే అనుకున్నాం. ప్రతి ప్రాడక్ట్ కు పాజిటివ్, నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి. మేము పాజిటివ్ ను తీసుకుని ముందుకు వెళ్తున్నాం. మా లాంటి చిన్న చిత్రానికి ఇలాంటి భారీ విజయాన్ని అందించిన అందరికీ థ్యాంక్స్’ అన్నారు.

ప్రొడ్యూసర్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాకు ప్రేక్షకుల పెద్ద విజయాన్ని అందించారు. శ్రీధర్ గారితో కలిసి మేము చేసిన తొలి ప్రయత్నంలోనే విజయం దక్కింది. మా విక్రాంత్, చాందినీ నటన అందరినీ ఆకట్టుకుంది. డైరెక్టర్ సంజీవ్ గారు సకుటుంబంగా చూసేలా సినిమాను రూపొందించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా ఉండాలనే మంచి సందేశాన్ని మా సినిమా ద్వారా చెప్పాం.’ అని అన్నారు.

డైలాగ్ రైటర్ కల్యాణ్ రాఘవ్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, స్క్రీన్‌ప్లే రైటర్ షేక్ దావూద్ తదితరులు పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా కోసం థియేటర్స్‌కి రావడం టీమ్‌ను ఉత్సాహపరచిందని పేర్కొన్నారు.

తాజా వార్తలు