రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘కింగ్డమ్’ చిత్ర ట్రైలర్ లాంచ్ తిరుపతిలో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో విజయ్ తన అద్భుతమైన స్పీచ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పూర్తిగా చిత్తూరు యాసలో విజయ్ దేవరకొండ తన స్పీచ్‌ను సాగించడం విశేషం.
ఇక తన స్పీచ్‌లో మరో ఇంట్రెస్టింగ్ అంశంగా పుష్ప చిత్రంలోని డైలాగును విజయ్ దేవరకొండ చెప్పడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది. ‘‘ఆ తిరుపతి ఏడుకొండల వెంకన్న సామీ గాని.. ఈ ఒక్కసారి నా పక్కన ఉండి నడిపించినాడో.. చానా పెద్దోన్నయి పూడుస్తాను సామి.. పోయి టాప్‌లో పోయి కూసుంటా..’’ అంటూ విజయ్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించింది.
ఈ సినిమా కోసం అందరూ కష్టపడ్డారని.. ఈ సినిమాను తనకంటే ఎక్కువగా గౌతమ్, నాగవంశీ, భాగ్యశ్రీ, అనిరుధ్ కేర్ తీసుకున్నారని.. వారు పడ్డ కష్టానికి మంచి ఫలితం రావాల్సిందే అంటూ విజయ్ పూర్తి కాన్ఫిడెంట్‌గా తన స్పీచ్‌ను కొనసాగించాడు.