‘ఫైటర్’ మీద దేవరకొండకు అంత నమ్మకమా

హీరో విజయ్ దేవరకొండ నిన్న జరిగిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇకపై ప్రేమ కథలు చేయనని, ఇదే ఆఖరు లవ్ స్టోరీ అని చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి ఆయన హీరోగా తర్వాతి దశకు అంటే మాస్ హీరోగా రూపాంతరం చెందాలని గట్టిగానే భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ ప్రయత్నాల్లోనే ఆయన పూరి జగన్నాథ్ సినిమాను చేస్తున్నారు.

పూరి సినిమా అంటే హీరో ఎవరైనా ఛేంజ్ ఓవర్ తప్పక కనిపిస్తుంది. ఒకరకంగా మాస్ ఇమేజ్ సంపాదించడం కోసమే పూరితో సినిమాలు చేయాలని చాలామంది యువ హీరోలు కోరుకుంటుంటారు. అలా చాలామందిని మాస్ హీరోలుగా నిలబెట్టిన క్రెడిట్ పూరికి ఉంది. ప్రస్తుతం విజయ్ టర్న్ వచ్చింది. పూరి దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేస్తున్న విజయ్ నెక్స్ట్ టర్న్ మాస్ హీరోగా అని గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. అందుకే ఆయన ఇకపై మాస్ బాటలోనే ప్రయాణించాలని ప్రేమ కథలకు గుడ్ బై చెబుతున్నట్టున్నారు.

Exit mobile version