‘ఫైటర్’ ప్లాష్ బ్యాక్ కోసం విజయ్ న్యూ లుక్ !

‘ఫైటర్’ ప్లాష్ బ్యాక్ కోసం విజయ్ న్యూ లుక్ !

Published on May 17, 2020 10:06 PM IST

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నా.. అటు బిజినెస్ మేన్ గానూ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చాల బ్యాలెన్స్ డ్ గా కెరీర్ ను హ్యాండిల్ చేస్తున్నాడు. తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేసిన విజయ తన తాజా సినిమా ఫైటర్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ లో ఓ న్యూ లుక్ లో కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన లుక్ కోసం వర్కౌట్స్ చేస్తున్నాడట. అలాగే తన హెయిర్ స్టైల్ ను పూర్తిగా మార్చడంతో పాటు సిక్స్ ఫ్యాక్ లో కనిపించబోతున్నాడట. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో ఈ సినిమాని చేస్తున్నాడు.

కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు