విలక్షణ నటి రాజసులోచన ఇక లేరు

rajasulochana

విలక్షణ నటి రాజసులోచన గారు ఇక లేరు. అనారోగ్యంతో ఈ రోజు ఉదయం ఆమె చెన్నైలోమరణించారు. ఈమె 1935లో విజయవాడలో జన్మించారు. రాజసులోచన 1953లో ‘గుణసాగరి’ అనే కన్నడ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు.
రాజసులోచన ‘తాత మనవడు’, ‘పాండవ వనవాసం’, ‘శాంతి నివాసం’, రాజ మకుటం’, ‘తోడికోడళ్ళు’ సినిమాతో తెలుగులో మంచి పేరును సంపాదించుకున్నారు. ఆమె దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, కన్నడ మొదలగు భాషలలో అప్పటి అగ్ర హీరోలైన ఎన్.టి.అర్, ఎ.ఎన్.అర్, ఎమ్.జి.అర్, శివాజీ గణేషన్, రాజ్ కుమార్ మొదలగు అగ్రహీరోలందరితో కలిసి నటించారు.రాజసులోచన ప్రముఖ డైరెక్టర్ సి.ఎస్. రావు ను వివాహం చేసుకుంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు. ఆమె అంత్యక్రియలని రేపు చెన్నై లో జరగనున్నాయి.

123తెలుగు.కామ్ తరపున రాజసులోచన గారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాము.

Exit mobile version