హీరోగా మారిన వెన్నెల కిషోర్

హీరోగా మారిన వెన్నెల కిషోర్

Published on Oct 8, 2012 9:38 PM IST


దేవ్ కట్ట దర్శకత్వంలో వచ్చిన “వెన్నెల” చిత్రంతో హాస్యనటుడిగా తెరకు పరిచయమయ్యి తన మొదటి చిత్ర పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న “వెన్నెల” కిషోర్ ఈ మధ్యనే “వెన్నెల 1 1/2” అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం ఈ నటుడు మరో కొత్త అవతారం ఎత్తనున్నాడు లక్ష్మణ్ గంగారపు దర్శకత్వంలో పిరమిడ్ క్రియేషన్స్ బ్యానర్ మీద జగదీశ్ రెడ్డి మరియు అమరెంధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న “అతడు ఆమె ఒక స్కూటర్” చిత్రంతో వెన్నెల కిషోర్ హీరో గా అవతారం ఎత్తనున్నాడు . ఈ చిత్రానికి చిన్ని కృష్ణ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రంలో తాగుబోతు రమేష్ ఒక పాటను పాడటం విశేషం. ఈ చిత్రానికి వి కే రామ రాజు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు