స్విజ్జర్లాండ్ లో పాటలు పాడుకుంటున్న వెంకటేష్


కుటుంబ కథా చిత్రాలే కాకుండా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటుగా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే హీరో వెంకటేష్ ఈ సారి మాఫియా నాయకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘షాడో’. ఈ చిత్ర బృందం పాటల చిత్రీకరణ కోసం ఇటీవలే స్విజ్జర్లాండ్ బయల్దేరింది. ఈ నెల 20వ తేదీ వరకు అక్కడే నిర్విరామంగా ఈ షెడ్యుల్ జరగనుంది. శ్రీకాంత్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉండబోతుందని దర్శకుడు మెహర్ రమేష్ చెబుతున్నారు. వెంకటేష్ కి జోడీగా తాప్సీ నటిస్తుండగా శ్రీకాంత్ కి జోడీగా మధురిమ నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

Exit mobile version