స్విజ్జర్లాండ్లో వెంకటేష్ ‘షాడో


విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ‘షాడో’ చిత్రం కోసం ప్రస్తుతం స్విజ్జర్లాండ్లో పాటలు పాడుకుంటున్నాడు. వెంకటేష్ మరియు తాప్సీ లపై పాట చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజుసుందరం ఆధ్వర్యంలో ఈ పాట చిత్రీకరిస్తున్నారు. మాఫియా నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్ మాఫియ నేత పాత్ర పోషిస్తున్నారా లేదా మాఫియా అంతు తేల్చే అధికారి పాత్ర పోషిస్తున్నారా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు దర్శకుడు మెహర్ రమేష్. వెంకటేష్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉంటూ అభిమానుల్ని ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. శ్రీకాంత్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా అతనికి జోడిగా మధురిమ నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మ్సితున్నారు.

Exit mobile version