నవంబర్ 1న వెంకీ, రామ్ ల ‘మసాలా’?

నవంబర్ 1న వెంకీ, రామ్ ల ‘మసాలా’?

Published on Oct 15, 2013 12:00 PM IST

Masala-Movie
విక్టరీ వెంకటేష్, ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న ‘మసాలా’ సినిమా త్వరలో విడుదల కావడానికి సిద్దం అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని నిర్వాహకులు నవంబర్ 1న విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. దీనికి సంబందిచి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్, మంచి కామెడీ, యాక్షన్ తో తెరకెక్కుతోంది. థమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని విజయ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంజలి, షాజాహన్ పదమ్సీ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని బాలీవుడ్ లో బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాదించిన ‘బోల్ బచ్చన్’ రీమేక్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్రవంతి రవి కిషోర్, సురేష్ బాబులు కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు