ఒకరికొకరు సహాయం చేసుకుంటున్న మహేష్ బాబు, వెంకటేష్

ఒకరికొకరు సహాయం చేసుకుంటున్న మహేష్ బాబు, వెంకటేష్

Published on Apr 12, 2012 8:25 AM IST


విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకకరికొకరు కష్టాల్లో సాయం చేసుకుంటున్నారు. అదేనండీ మేము మాట్లాడుతున్నది “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రంలో వారి పాత్రలు గురించి. ఈ చిత్రంలో అన్నదమ్ములుగా కనిపిస్తున్న వీరు ఇరువురు ఒకరికోసం ఒకరు ఏదయినా చెయ్యడానికి సిద్దపడే పాత్రలలో కనిపించనున్నారు. వీరి మధ్య బంధం విడదీయలేనిదిగా ఉండబోతుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు దసరాకి విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. ప్రకాశ్ రాజ్ ఈ ఇద్దరి హీరోలకు తండ్రిగా కనిపించబోతున్నారు కొన్నాళ్ళ క్రితం ఈయన ఈ చిత్రం నుండి తప్పుకున్నారు కాని తిరిగి వచ్చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. సమంత మరియు అంజలి లు కథానాయికలుగా నటిస్తున్నారు. మిక్కి.జే.మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు