‘యుఫోరియా’లో ఆ సీక్వెన్స్ హైలైట్ అట !

‘యుఫోరియా’లో ఆ సీక్వెన్స్ హైలైట్ అట !

Published on Aug 24, 2025 2:01 PM IST

Euphoria

గుణశేఖర్‌ దర్శకత్వంలో విఘ్నేశ్‌ గవిరెడ్డి హీరోగా రాబోతున్న సినిమా ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుందని.. ముఖ్యంగా ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా వైవిధ్యంగా ఉంటుందని.. మొత్తానికి ఈ సినిమా కథలో చాలా వేరియేషన్స్ ఉంటాయని సమాచారం. కథలోని ఆ వేరియేషన్స్ కారణంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తోందట.

మొత్తానికి గుణశేఖర్ రాసిన స్క్రిప్ట్ చాలా కొత్తగా ఉండబోతుందని.. గుణశేఖర్ లో కొత్త కోణాన్ని చూస్తారని.. అలాగే ప్రధానంగా నేటి యువత తాలూకు ఎమోషన్స్ ను చాలా బాగా చూపించబోతున్నారని తెలుస్తోంది. కాబట్టి.. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. అలాగే, అందరికీ కనెక్ట్‌ అయ్యే మంచి సందేశం కూడా ఉంది. ఈ సినిమాతో దాదాపు 20మంది కొత్తవాళ్లు తెరకు పరిచయం కానున్నారు. కాగా ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గట్లుగా ఉంటుందట.

తాజా వార్తలు