‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?

‘ఓజి’తో అకిరా గ్రాండ్ డెబ్యూ? నిజమేనా?

Published on Aug 25, 2025 12:00 AM IST

ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న పలు భారీ చిత్రాల్లో గట్టి హైప్ ఉన్న చిత్రం “ఓజి” కూడా ఒకటి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా ఒకో అప్డేట్ తో మరింత హైప్ పెంచుకుంటూ వస్తుంది. ఇక ఈ సినిమాపై ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లో మరో టాక్ కొత్తగా ఊపందుకుంది.

ఈ సినిమాలో పవన్ వారసుడు అకీరానందన్ ఉన్నాడని ఓ టాక్ ఉంది. మొన్న వచ్చిన ఫైర్ స్టార్మ్ సాంగ్ లో కూడా కొన్ని విజువల్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అకిరాకి సెట్ అవుతున్నాయని ఫ్యాన్స్ గమనించారు. ఇప్పుడు మళ్ళీ ఓ మెగా క్యామియో సినిమాలో ఉన్నట్టుగా టాక్ మొదలైంది. ఇది అకిరా పైనే అంటూ మళ్ళీ హాట్ టాపిక్ మొదలైంది.

ఈ సినిమాలో పవన్ పై మూడు దశలు కనిపించనున్నాయి అని గతంలో ఈ సినిమాకి వర్క్ చేసిన నటుడు ఒకరు రివీల్ చేశారు. అందులో పవన్ యంగ్ ఏజ్ స్టేజ్ కూడా ఒకటి. మరి అందులో అకిరాని కానీ సెట్ చేస్తే థియేటర్స్ బ్లాస్ట్, అకిరాకి ఇంతకు మించిన సిల్వర్ స్క్రీన్ డెబ్యూ మరొకటి ఉండదని చెప్పవచ్చు. అయితే కొంతమంది అందులో నిజం లేదని కూడా అంటున్నారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పాలి.

తాజా వార్తలు