ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే

ఫోటో మూమెంట్: సీఎం చంద్రబాబుకి 1 కోటి చెక్కు అందించిన మెగాస్టార్.. కారణమిదే

Published on Aug 24, 2025 7:00 PM IST

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న వరుస సినిమాలతో మంచి అంచనాలు ఒకో దానిపై నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు కోసం పక్కన పెడితే మొన్న మెగాస్టార్ బర్త్ డే ని అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఇక మెగాస్టార్ ఉదారత, తన దాన గుణం కోసం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తన విశాల హృదయాన్ని చూపించారు.

ఏపీ ముఖ్యమంత్రి సంక్షేమనిధికి చిరంజీవి ఏకంగా 1 కోటి రూపాయలు అందించారు. దీనితో ఆ చెక్కుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అందించిన పిక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ పిక్ లో చిరు, చంద్రబాబు ఇద్దరూ హ్యాపీ ఫేస్ లతో కనిపిస్తుండగా మెగా అభిమానులు మాత్రం తమ హీరో ఉదారతా భావాన్ని చూసి మరోసారి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు