విక్టరీ వెంకటేష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘షాడో’ మార్చ్ 28న విడుదలకు ప్లాన్ చేసారు.కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ లో మన ముందుకి వస్తుందట. ఈ వార్త ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.బహుశా ఇంకో రెండు వారాలలో రావచ్చు.
ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం.గ్రాండ్ లోకేషన్లలో భారీ యాక్షన్ దృశ్యాలకు గాను చాల డబ్బు ఖర్చు చేసారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో మార్చ్ 7న విడుదల కానుంది.శ్రీకాంత్ మరియు మధురిమ ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.