ఇలాంటి సినిమాల్లోనే నేచురల్ గా చేయడానికి ఆస్కారం ఉంటుంది :వెంకటేష్

Venkatesh

హానెస్టీతో చేసిన పాత్రలన్నీ తెలుగు ఆడియెన్స్ ఈజీగా రిసీవ్ చేసుకుంటారని విక్టరీ వెంకటేష్ చెబుతున్నారు. ఆయన నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా గురించి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో సైలెంట్ క్యారెక్టర్ చేసాను. డైలాగులు తక్కువగా ఉంటూ సైలెంట్ క్యారెక్టర్స్ చేయడం కొంచెం కష్టమే. అందులోనూ ఇలాంటి సినిమాల్లోనే నేచురల్ గా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంటర్వెల్ తరువాత వచ్చే సీన్ ‘పూల కుండి ఎందుకు తన్నావురా’, క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తూ చేసాను. ప్రకాష్ రాజ్ గారు భద్రాచలం ఎపిసోడ్లో చేసిన సీన్ చూసినపుడు నాకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెశన్స్ కొందరు యాక్టర్స్ మాత్రమే ఇవ్వగలరు. ఈ సినిమా ఒప్పుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మొదటి రోజు నుండే మమ్మల్ని స్టార్ హీరోలలాగా చూడలేదు, మేము కూడా స్టార్ హీరోలం అని బిహేవ్ చేయలేదు అందుకే ఇంత మంచి ప్రాజెక్ట్ బైటికి వచ్చింది అన్నారు.

Exit mobile version