గత సంవత్సరం వరకు బాగా బిజీగా ఉన్న స్టార్స్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. ప్రతి సంవత్సరం మూడు లేదా నాలుగు సినిమాలు రిలీజ్ చేసే రవితేజ బాక్స్ ఆఫీసు వద్ద వరుస పరాజయాల్ని అందుకోవడం వల్ల వరుస సినిమాలు చేయడం తగ్గించి కాస్త సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటున్నారు.
రవితేజ ‘బలుపు’ తో సక్సెస్ అందుకున్న తర్వాత మరో సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇప్పటికే రవితేజ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇది త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం రవితేజ వీరూ పోట్ల దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. ప్రస్తుతం వీరూ పోట్ల ‘దూసుకెళ్తా’ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అతను రవితేజ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే రీతిలో స్టొరీ రెడీ చేసినట్టు చెప్పారు. ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమాని నిర్మించానున్నాడని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.