మంచు మనోజ్ హీరోగా నటించిన ‘పోటుగాడు’ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఈ సినిమా మనోజ్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలాగే మనోజ్ తన మొదటి కమర్షియల్ హిట్ అయిన ‘బిందాస్’ రికార్డ్స్ ని క్రాస్ చేసేసిన విషయం మనకు విషయం తెలిసిందే..
తాజాగా సక్సెఫుల్ కాంబినేషన్ అయిన వీరు పోట్ల – మనోజ్ కాంబినేషన్లో బిందాస్ 2 అనే సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై మంచు విష్ణు నిర్మించనున్నాడు. ఇదే విషయాన్ని నిన్న జరిగిన దూసుకెళ్తా ఆడియో ఫంక్షన్ వేడుకలో తెలియజేసారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.