అక్టోబర్ చివరికల్లా పూర్తి కానున్న ‘వసూల్ రాజా’

అక్టోబర్ చివరికల్లా పూర్తి కానున్న ‘వసూల్ రాజా’

Published on Oct 1, 2012 10:54 PM IST


వరుసగా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నవదీప్ హీరోగా, రీతు బర్మేచా కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘వసూల్ రాజా’. డబ్బంటే అత్యాస ఉన్న ఒక యువకుడికి డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంటుంది, ఆ డబ్బు అతనికి ఎలా వస్తోంది? అతను ఎం చేస్తున్నాడు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ సెట్లో ఒక పాటను చిత్రీకరించారు. ఈ నెల చివరి వరకు జరిగే షెడ్యూల్ తో ఈ చిత్ర చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని ఈ చిత్ర దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ తెలియజేశారు. అలాగే సినిమా ఆద్యంతం ప్రేక్షకుడిని నవ్విస్తుందని ఆయన అన్నారు. ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీ హరి కీలక పాత్ర పోషిస్తున్నారు. బత్తుల రతన్ పాండు మరియు మహంకాళి దివాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిన్ని చరణ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నవదీప్ ఈ సినిమాతో పాటు ‘బంగారు కోడిపెట్ట’, ‘పొగ’ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే నవదీప్ నటించిన ‘మైత్రి’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు