బార్సెలోనాలో సందడి చేస్తున్న వస్తా నీ వెనుక టీం

బార్సెలోనాలో సందడి చేస్తున్న వస్తా నీ వెనుక టీం

Published on Jan 26, 2014 6:15 PM IST

Vastha-Nee-Venuka
హవీష్, ఈశ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ‘వస్తా నీ వెనుక’ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లోని బార్సెలోనాలో జరుగుతోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉండనున్న ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని యూరప్ లోనే షాట్ చేయనున్నారు. రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.

రవిబాబు తీసిన నువ్విలా సినిమాతో పరిచయమైన హవీష్ చివరిగా ఓంకార్ డైరెక్ట్ చేసిన జీనియస్ సినిమాలో కనిపించాడు. ఈ మూవీ గురించి రమేష్ వర్మ చెబుతూ ‘ వస్తా నీ వెనుక సినిమా కాంటెంపరరీ లవ్ స్టొరీ. ఈ సినిమాని గ్రాండ్ గా ఉండేలా దాసరి కిరణ్ కుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చుతుందని’ అన్నాడు. ఈ మూవీలో ఈశతో పాటు మరో హీరోయిన్ కూడా ఉండనుంది.

తాజా వార్తలు