పూర్తికావచ్చిన నువ్విలా నేనిలా చిత్రీకరణ

పూర్తికావచ్చిన నువ్విలా నేనిలా చిత్రీకరణ

Published on Sep 6, 2013 5:30 PM IST

Varun-Sandesh-Nuvvalaa-Nenila
వరుణ్ సందేశ్ ను హిట్ పలకరించి చాలాకాలం అయ్యింది. ప్రస్తుతం అతను తన కెరీర్ ను నిలబెట్టే హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు అతను నటిస్తున్న చిత్రం ‘నువ్విలా నేనిలా’. ఈ సినిమాలో పూర్ణ హీరోయిన్. ‘మేం వయసుకు వచ్చాం’, ‘ప్రియతమా నీవచట కుశలమా’ చిత్రాలని తీసిన త్రినాధ్ రావు ఈ సినిమాకు దర్శకుడు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రాజ శేఖర్ నిర్మిస్తున్నాడు

ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ “ఒక పాట మినహా చిత్రీకరణ ముగిసింది. ఈ సినిమా ఆడియో ను అక్టోబర్లో విడుదలచేసి ఆ తరువాత చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నామని”తెలిపారు. ఈ చిత్రంతోనైనా వరుణ్ తిరిగి ఫామ్ లోకి వస్తాడని ఆశిద్ధాం

తాజా వార్తలు