వరుణ్ సందేశ్ “కానిస్టేబుల్” కి U/A – విడుదలకు సిద్ధం!

వరుణ్ సందేశ్–మధులిక వారణాసి జంటగా నటించిన “కానిస్టేబుల్” చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్‌.కె. దర్శకత్వంలో, బలగం జగదీశ్ నిర్మించిన ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్‌ను తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ విడుదల చేసి, చిత్ర బృందానికి విజయాశీస్సులు అందించారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ఈ చిత్రం తన కెరీర్‌కు కీలక మలుపు అవుతుందని చెప్పారు. నిర్మాత బలగం జగదీశ్, సెన్సార్ కంప్లీషన్‌తో పాటు ట్రైలర్‌కు వచ్చిన మంచి స్పందనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ నెల 10న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు. దసరా సందర్భంగా విడుదల చేసిన ఐటమ్ సాంగ్‌కూ మంచి రిస్పాన్స్ వచ్చిందన్నారు.

దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్‌.కె. మాట్లాడుతూ, సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుందని, ట్రైలర్‌కు వచ్చిన స్పందనతోనే సగం విజయం సాధించిన భావన ఉందని అన్నారు. ట్రైలర్‌ను 50 లక్షల మందికి పైగా వీక్షించడం చిన్న విషయం కాదని పేర్కొన్నారు.

Exit mobile version