అందుకే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చేశా – రామ్ పోతినేని

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌ను కూడా చిత్ర యూనిట్ ప్రారంభించింది. ఇక ఈ సినిమాను దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రామ్ పోతినేని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.

రామ్ మాట్లాడుతూ.. ‘ఇటీవల సినిమాలు హింసాత్మకంగా మారాయి. అందుకే సౌమ్యమైన భావోద్వేగ చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకుని ఆంధ్ర కింగ్ తాలూకా చేశా. ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దాం’ అని అన్నారు.

భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 28న గ్రాండి రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version