గ్లొబ్ ట్రాటర్ ఈవెంట్ ముందు జక్కన్న నుంచి సర్ప్రైజ్ అప్డేట్!

SSMB29

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ గా వస్తున్న ఈ భారీ చిత్రంకి సంబంధించి గ్రాండ్ ఈవెంట్ ఈ 15న జరగనుండగా ఈ ఈవెంట్ కి ముందు జక్కన్న ఫ్యాన్స్ కి ఓ క్రేజీ అప్డేట్ ని అందించారు. ప్రస్తుతం ముగ్గురిపై క్లైమాక్స్ షూట్ చేస్తూనే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సన్నాహాలు కూడా చూస్తున్నామని తెలిపారు.

అంతే కాకుండా ఎవరూ ఊహించనిది తాము ప్లాన్ చేస్తున్నట్టు తాను తెలిపారు. ఇక అంతకు ముందు ఈ వారంలో వరుస అప్డేట్స్ ఉంటాయని జక్కన్న కన్ఫర్మ్ చేశారు. అలానే ఈరోజు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాలూకా ఫస్ట్ లుక్ ని నేడే విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఇదెలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సర్ప్రైజింగ్ అప్డేట్ తో అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు.

Exit mobile version