మన టాలీవుడ్ నుంచి వచ్చిన మంచి హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో సూపర్ హిట్ చిత్రం మసూద కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ హీరోగా నటించాడు. టక్ జగదీష్ సినిమాలో మంచి నెగిటివ్ పాత్ర చేసి విలనిజాన్ని చూపించిన తను మరో రెండు బిగ్ ప్రాజెక్ట్ లలో కీలక నెగిటివ్ పాత్రలనే మిస్ చేసుకున్నట్టు తెలిపాడు. అవి కూడా సలార్, కింగ్డమ్ లాంటి ప్రాజెక్ట్ లలో అట.
సలార్ సినిమాలో కాటేరమ్మ ఫైట్ సీన్ లో కనిపించే విష్ణు రోల్ అలానే కింగ్డమ్ లో మెయిన్ విలన్ రోల్ అవకాశాలే తనకి వస్తే తను మిస్ చేసుకున్నట్టు తన లేటెస్ట్ సినిమా ప్రీ వెడ్డింగ్ షో సినిమా ప్రమోషన్స్ లో తెలిపాడు. మరి ఆ సినిమాల్లో తను ఆ రోల్స్ వదులుకున్నందుకు తర్వాత కొంచెం ఫీల్ అయ్యాడట. ఆ రోల్స్ లో ఈ యువ హీరో సెట్ అయ్యవాడే.. కానీ మరోలా జరిగింది.
